HomeTelugu Trendingఆశ్రమంలో సాయి పల్లవి

ఆశ్రమంలో సాయి పల్లవి

Sai pallavi
టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న హీరోయిన్ సాయిపల్లవి. మలయాళీ ముద్దుగుమ్మ అయినా తెలుగు అమ్మాయిలా కనిపిస్తోంది. ఇటీవలే నాగచైతన్యతో కలిసి నటించిన ‘లవ్‌స్టోరీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వసూళ్లను కొల్లగొట్టి టాలీవుడ్‌కు పూర్వపు వైభవాన్ని తెచ్చిపెట్టింది. ఈ మూవీలో సాయిపల్లవి తన డ్యాన్సులతో అభిమానుల గుండెలను కొల్లగొట్టింది. ఫిదా తరహాలోనే మరోసారి తెలంగాణ స్లాంగ్‌లో డైలాగులు చెప్పి అలరించింది. కరోనాతో ఓటీటీకే పరిమితమైన సినిమాలు సాయిపల్లవి నటించిన లవ్‌స్టోరీ తర్వాత టాలీవుడ్‌లో మంచి ఊపు వచ్చిందనే చెప్పాలి. ఇప్పుడు వరుసగా సినిమాలు విడుదలవుతున్నాయి.

sai pallavi2

సాయి పల్లవి సడన్‌గా పుట్టపర్తిలోని సత్యసాయి ఆశ్రమంలో ప్రత్యక్షమైంది. సంప్రదాయమైన చీరకట్టులో సాధారణ మహిళగా కనిపిస్తోంది. సత్యసాయి సమాధిని దర్శించుకుని నివాళులు అర్పించింది. సాయిపల్లవి తల్లి పుట్టపర్తి సత్యసాయి భక్తురాలు. అందుకే ఆమెకు సాయి అని వచ్చేలా సాయిపల్లవి అనే పేరును పెట్టినట్లు తెలుస్తోంది. తల్లి తరహాలోనే సాయిపల్లవి కూడా పుట్టపర్తి సత్యసాయి భక్తురాలు. ఈ నేపథ్యంలోనే ఆమె పుట్టపర్తికి వచ్చి సత్యసాయి ఆశ్రమాన్ని సందర్శించింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu