HomeTelugu Trendingతండేల్‌ షూటింగ్‌ అప్డేట్‌.. న్యూ పోస్టర్‌ రిలీజ్‌

తండేల్‌ షూటింగ్‌ అప్డేట్‌.. న్యూ పోస్టర్‌ రిలీజ్‌

Thandel shooting update
అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్’. చైతూ మత్స్యకారుడిగా నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. చందూ మొండేటి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‍గా నటిస్తుంది. షూటింగ్‌ కంటే ముందే ఈ సినిమా కోసం మూవీ యూనిట్ చాలా కసరత్తులు చేసింది. తాజాగా తండేల్ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఆ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా వెల్లడించింది.

తండేల్ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోందని గీతా ఆర్ట్స్ వెల్లడించింది. సముద్రం ఒడ్డున ఓడల మధ్య నాగచైతన్య నడుచుకుంటూ వెళుతున్నట్టుగా ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ‘సముద్రం మధ్య ఉత్కంఠభరితమైన షెడ్యూల్‍ను తండేల్ టీమ్ మొదలుపెట్టింది. షూటింగ్ జరుగుతోంది’ అని గీతా ఆర్ట్స్ ట్వీట్ చేసింది. త్వరలోనే మరిన్ని ఎగ్జైటింగ్ అప్‍డేట్లను ఇస్తామని పేర్కొంది.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ ఉడిపిలో జరుగుతోంది. మాల్పే పోర్టు సమీపంలో చిత్రీకరణ జరుగుతుండగా.. ఇటీవలే ఇందుకు సంబంధించి ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సినిమాకి దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‍లో భారీ బడ్జెట్‍తో ఈ సినిమా రూపొందుతోంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu