HomeTelugu Trendingకమెడియన్‌తో సాయిపల్లవి రొమాన్స్‌!

కమెడియన్‌తో సాయిపల్లవి రొమాన్స్‌!

Sai pallavi to romance with

సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళలోనూ భారీగా అభిమానులున్నారు. తాజా సాయి పల్లవి గురించి ఓ ఆసక్తికర వార్త కోలీవుడ్‌లో చకర్లు కొడుతుంది. ప్రముఖ హాస్యనటుడు కాళి వెంకట్‌ హీరోగా చిత్రం తెరక్కెనున్నట్లు కోలీవుడ్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో హీరోయిన్‌ పాత్ర కోసం మేకర్స్‌ సాయిపల్లవిని సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్టుపై ఇంకా సంతకం చేయలేదని సమాచారం. ఈ ప్రాజెక్టుపై నాచ్యురల్‌ బ్యూటీ సైన్‌ చేస్తే సంచలనమేనని కోలీవుడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం సాయిపల్లవి తెలుగులో నాగచైతన్యతో లవ్‌స్టోరీ, దగ్గుబాటి రాణాతో విరాటపర్వం చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu