HomeTelugu TrendingSai Pallavi to Sreeleela: డాక్టర్స్ కాబోయి యాక్టర్స్‌గా మారిన సెలబ్రిటీస్ వీళ్లే!

Sai Pallavi to Sreeleela: డాక్టర్స్ కాబోయి యాక్టర్స్‌గా మారిన సెలబ్రిటీస్ వీళ్లే!

Sai Pallavi to Sreeleela

Sai Pallavi to Sreeleela: చాలామంది హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, నటీమణులు సినీ ఇండస్ట్రీ లోకి రాకముందు ఉన్నత చదువులు చదివి, ఉన్నత స్థానంలో ఉండాలని ఎన్నో కలలు కంటూ, వాటిని సాకారం చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. కానీ అనుకోకుండా వీరిని అదృష్టం తలుపు తడితే, ఇక ఆ కలలను మధ్యలోనే ఆపుకొని, వచ్చిన అదృష్టం వైపు వెళ్లాల్సి ఉంటుంది. అలా డాక్టర్స్ అవ్వాలని కలలుకని యాక్టర్ గా మారి ఇండస్ట్రీలో దూసుకుపోతున్న నటీనటులు కూడా టాలీవుడ్ లో చాలామంది ఉన్నారు.

టాలీవుడ్ లో ఫిదా సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మలయాళీ ముద్దుగుమ్మ సాయి పల్లవి. వరుస సినిమాలతో హీరోయిన్‌గా దూసుకుపోతుంది. మొదటి ఎంబిబిఎస్ చదివింది. ఎప్పటికైనా డాక్టర్ గా రాణించాలని ఆమె కల. అనుకోకుండా నటన రంగంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం బాలీవుడ్‌, టాలీవుడ్‌ల్లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో నాగచైతన్య హీరోగా నటిస్తున్న తండేల్‌ మూవీలో హీరోయిన్‌గా నటిస్తుంది. బాలీవుడ్‌లో రామయణంతో పాటు మరో సినిమా కూడా చేస్తుంది.

టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న శ్రీ లీల లక్ష్యం కూడా డాక్టర్ కావడమే. సినిమాలతో బిజీగా ఉన్న శ్రీ‌లీలా ఎప్పటికైనా తన డాక్టర్ చదువును పూర్తి చేసి డాక్టర్ గా రాణించాలని చూస్తోంది. ప్రస్తుతం సినిమా ఆఫర్లు తగ్గడంతో తన చదువుపై దృష్టి పెట్టింది.

యాంగ్రీ యంగ్‌మ్యాన్ రాజశేఖర్- జీవిత కూమార్తె శివానీ రాజశేఖర్ కూడా డాక్టర్‌ కాబోయి యాక్టర్‌గా మారింది. ఆమె ఎంబీబీఎస్ పూర్తి చేసింది. తెలుగులో అద్భుతం, కోటబొమ్మాలి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా విద్యావాసుల అహం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది మానుషి చిల్లర్. బాలీవుడ్‌లో పలు సినిమాలు చేసిన ఈ బ్యూటీ ప్రపంచ సుందరి కిరీటం గెలుచుకుంది. ఆమె కూడా డాక్టర్‌ కాబోయి యాక్టర్‌గా మారింది.

ప్రస్తుతం టాలీవుడ్ లో కీలకపాత్రలో నటిస్తూ దూసుకుపోతున్న కామాక్షి భాస్కర్ల కూడా తన డాక్టర్ చదువును పూర్తి చేసింది కొన్నాళ్ళు డాక్టర్ విధులను నిర్వర్తించిన తర్వాత సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. అలాగే ఉమామహేశ్వర ఉగ్ర‌ రూపస్య‌ సినిమాతో జ్యోతిక‌గా టాలీవుడ్ ప్రేక్షకుల‌కు పరిచయమైన రూపా కూడా తన డాక్టర్ చదువును పూర్తి చేసింది. గుంటూరు మెడికల్ కాలేజీలో చదువు పూర్తి చేసిన ఈమె అంబిషన్ కూడా డాక్టర్ గా రాణించడమేనట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!