HomeTelugu Trendingనాగ చైతన్యని ఆడించనున్న సాయిపల్లవి

నాగ చైతన్యని ఆడించనున్న సాయిపల్లవి

Sai pallavi to choreograph

టాలీవుడ్‌ లో శేఖర్ కమ్ముల సినిమా ‘ఫిదా’తో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ సాయి. తాజాగా సాయి పల్లవి కొరియోగ్రాఫర్‌గా మారనున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు మరోసారి ఆయన దర్శకత్వంలోనే నాగ చైతన్య హీరోగా ‘లవ్ స్టోరీ’ సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇందులోని కొన్ని ముఖ్యమైన సీన్లతో పాటుగా ఓ పాట కూడా షూట్ చేయాల్సి ఉందట. అయితే సాయి పల్లవి ఎంత మంచి డ్యాన్సరో అందరికి తెలిసిందే. ‘ఫిదా’ అలాగే ‘మారి-2’ సినిమాలో తాను చేసిన డాన్స్ తో ప్రేక్షకుల గుండెల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందువల్ల శేఖర్ కమ్ముల తన సినిమాలో మిగిలి ఉన్న ఆ ఒక పాటను కొరియోగ్రఫీ చేయమని పల్లవికి చెప్పాడట! ఇక స్వతహాగా డాన్సర్‌ అయిన సాయి పల్లవి కూడా వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా ఓకే చెప్పేసిందట! అంటే ఈ సినిమాలో సాయి పల్లవి నాగ చైతన్య ని ఆడించనుందన్న మాట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu