HomeTelugu News‘సోలో బ్రతుకే సో బెటర్‌’ .. థీమ్‌ వీడియో.. వైరల్‌

‘సోలో బ్రతుకే సో బెటర్‌’ .. థీమ్‌ వీడియో.. వైరల్‌

14 8
మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్‌’. ఈ చిత్రంతో సుబ్బు అనే దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో నభా నటేష్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని బి. బాపినీడు సమర్పణలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. టైటిల్‌ ప్రకటించినప్పట్నుంచి ఈ సినిమాపై పాజిటీవ్‌ వైబ్స్‌ క్రియేట్‌ అయ్యాయి. అంతేకాకుండా ఇప్పటివరకు చిత్రానికి సంబంధించి విడుదలైన ప్రతీ అంశం హైలైట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా ప్రేమికుల రోజు కానుకగా చిత్ర యూనిట్‌ చిన్న థీమ్‌ వీడియోను విడుదల చేసింది. ఎంతో ఎంటర్‌టైన్‌గా ఉన్న ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

73 సెక​న్ల నిడివి గల థీమ్‌ వీడియో ‘కష్టం, ఇష్టం, విచారం, సంతోషం, ఆనందం, బాధ ఇవన్నీ కాలంతో పాటు కారణాలతో పాటు మారిపోయే ఫీలింగ్స్‌ అలాగే ప్రేమ అనేది కూడా ఓ పీలింగే కదా.. మారదని గ్యారెంటీ ఏంటి?’ అంటూ సాయితేజ్‌ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమై.. ‘సోలో సోదర సోదరీమణులారా.. ఈ వేలెంటైన్స్‌ వీకెండ్‌ని మనం అంతా కలిపి జరుపుకుందాం.. మన నినాదం ఒకటే.. సోలో బ్రతుకే సో బెటర్‌’ అంటూ చివరి పంచ్‌తో ముగుస్తుంది. ఇక సాయితేజ్‌ బ్యాగ్రౌండ్‌లో కనిపించే మహానుభావుల ఫోటోలు హైలైట్‌గా నిలిచాయి. ఫుల్‌ అండ్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది మే1న విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu