HomeTelugu Newsభారత్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు

భారత్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు

8 17
భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజూ పెరుగుతూనే ఉంది. గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా రోజుకు 5 వేల చొప్పున కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 5242 పాజిటివ్ కేసులు, 157 మరణాలు నమోదయ్యాయి. ఒక్కరోజులో ఇంతటి స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావడం తొలిసారి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 96,169కి చేరింది. కరోనా బారిన పడి 3029 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం బాధితుల్లో 36,824 మంది కోలుకోగా మరో 56,316 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

దేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాల్లో 33,035 కేసులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఢిల్లీ, గుజరాత్, తమిళనాడులో తరువాతి స్థానాల్లో ఉన్నాయి. దేశం మొత్తంలో నమోదైన కేసుల్లో 65 వేలకు పైగా కేసులు ఈ నాలుగు రాష్ట్రాల్లోనే ఉండటం గమనార్హం. నాలుగు రాష్ట్రాల్లోనూ పాజిటివ్ కేసుల సంఖ్య 10 వేలకు పైగా ఉంది. మహారాష్ట్రలో ఒక్కరోజు 2347 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu