HomeTelugu Trendingఎన్టీఆర్‌కు విలన్‌గా బాలీవుడ్‌ నటుడు!

ఎన్టీఆర్‌కు విలన్‌గా బాలీవుడ్‌ నటుడు!

Saif ali khan as a villain

జూనియర్‌ ఎన్టీఆర్‌ -త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, యన్.టి.ఆర్. ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో విలన్‌గా బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. సైఫ్‌ అలీ ఖాన్‌ ప్రస్తుతం యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ రాముడిగా తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్‌’ చిత్రంలో రావణుడి పాత్రలో నటిస్తున్నాడు.

‘ఎన్టీఆర్‌ 30’ వర్కింగ్‌ టైటిల్‌గా రూపొందుతున్న ఈ సినిమాకి ‘అయినను పోయి రావలె హస్తినకు’, ‘చౌడప్ప నాయుడు’ వంటి పేర్లను చిత్రబృందం పరిశీలిస్తున్నట్లు సోషల్‌ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. మరి ఈ రెండింటిలో ఏ పేరును ఫైనల్‌ చేస్తారా? లేదా మరో పేరు పెడతారనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌లుగా రష్మిక, పూజా హెగ్డేల పేర్లు వినిపిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu