HomeTelugu Trending'సైంధవ్‌' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఫిక్స్‌

‘సైంధవ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఫిక్స్‌

saindhav pre release event
వెంకటేశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సైంధవ్’. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా (జనవరి 13)న ప్రేక్షకుల ముందుకు రానుంది. వెంకట్ బోయినపల్లి నిర్మించిన ఈ సినిమాకి శైలేశ్ కొలను దర్శకత్వం వహించాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి టైమ్‌కి ఫిక్స్‌ చేశారు.

ఈ నెల 7వ తేదీన వైజాగ్ లోని గోకుల్ పార్క్ లో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఆ రోజున సాయంత్రం 5:30 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అధికారిక పోస్టర్ రిలీజ్‌ చేశారు.

ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ నటించగా, ఇతర ముఖ్యమైన పాత్రల్లో ఆర్య, నవాజుద్దీన్ సిద్ధికీ, ఆండ్రియా,రుహని శర్మ కనిపించనున్నారు. తండ్రీ కూతుళ్ల ఎమోషన్ ప్రధానంగా నడిచే కథ ఇది. ఈ సినిమా తన కెరియర్ లోనే బెస్ట్ గా నిలుస్తుందని వెంకటేశ్ చెప్పడంతో, అభిమానులంతా మరింత ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu