HomeTelugu Trending'సైంధవ్‌' సెన్సార్‌ పూర్తి

‘సైంధవ్‌’ సెన్సార్‌ పూర్తి

venkatesh saindhav censor c
విక్టరీ వెంకటేష్ 75 వ సినిమా తెరక్కెకుతున్న చిత్రం ‘సైంధవ్’. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. శైలేష్ కొలను డైరెక్షన్‌లో వహించిన ఈ సినిమా కి U/A సర్టిఫికేట్‌ ఇచ్చారు. ఈ సినిమా యూనిక్ అండ్‌ యాక్షన్ ప్యాక్డ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ అని మేకర్స్ అంటున్నారు. ఇక తాజాగా విడుదలైన పాటల్లో చూపినట్లుగా, తండ్రీ కూతుళ్ళ బంధం సినిమాలో ప్రధాన అంశంగా చెబుతున్నారు.

మరో పక్క అంతర్లీనంగా వెంకటేష్, శ్రద్ధా శ్రీనాథ్ మధ్య మెచ్యూర్ రిలేషన్ షిప్ కూడా మనం చూడవచ్చు. తన కూతురితో కలిసి సింగిల్ పేరెంట్‌గా ఉన్న వెంకటేష్‌కి సహాయం చేయడానికి శ్రద్ధా శ్రీనాథ్ వస్తుంది. నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెరెమియా లాంటి ప్రముఖ యాక్టర్లు ఈ సినిమాలో కీలక పాత్రలలో అలరించనున్నారు.

పాన్ ఇండియా మూవీని తెరక్కెకుతున్న ఈసినిమాని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి భారీ స్థాయిలో నిర్మించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. ఎస్.మణికందన్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాకి అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్, గ్యారీ బిహెచ్ ఎడిటర్. బేబీ సారా పాలేకర్‌తో పాటు నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెరెమియా, జిషు సేన్ గుప్తా, జయప్రకాష్‌లు ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu