HomeTelugu Big StoriesSaindhav : ఓటీటీలోకి వచ్చేస్తున్న 'సైంధవ్'‌!

Saindhav : ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘సైంధవ్’‌!

Saindhav on OTT Release

Saindhav: వెంకటేశ్ హీరోగా నటించిన 75వ చిత్రం ‘సైంధవ్’. భారీ అంచనాల మధ్య సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర తీవ్రంగా నిరాశ పరిచింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను భారీ మొత్తానికి అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది.

ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.15 కోట్లకు కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు థియేటర్లలో నుంచి తప్పుకున్న ఈ సినిమా ఊహించినదాని కంటే ముందే ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 9న వస్తుందని భావించినా.. ఇప్పుడు ఫిబ్రవరి 2నే డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

దీనికి సంబంధించిన అధికారిక సమాచారం మాత్రం ఇంకా రాలేదు. శైలేష్ కొలను డైరెక్షన్ వచ్చిన లో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, ఆర్య, ఆండ్రియా, ముకేశ్ రిషి, బేబీ సారా, రుహానీ శర్మలాంటి ఈ యాక్షన్ మూవీ జనవరి 13న విడుదలైంది.

సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా మిగతా సినిమాలు గుంటూరు కారం, హనుమాన్, నా సామిరంగ సినిమాలు దాటికి తట్టుకోలేక పోయింది. ఈ సినిమాలు మంచి వసూళ్లే సాధించగా.. సైంధవ్ మాత్రం నిరాశ పరిచింది.
భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా.. నష్టాలను మిగిల్చింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu