HomeTelugu Newsనాని 'వి' చిత్రంపై బాంబే కోర్టులో కేసు

నాని ‘వి’ చిత్రంపై బాంబే కోర్టులో కేసు

Nani with Sakhi Malik

నేచురల్ హీరో నాని నటించిన వీ చిత్రంపై నటి సాక్షి మాలిక్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. మోహన కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్‌లో దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో సుధీర్‌బాబు, నివేదా థామస్, అదితిరావు నటించారు. ఈ చిత్రంలో ఓ సన్నివేశంలో కమర్షియల్ సెక్స్ వర్కర్‌ ఫొటోను వేరే వ్యక్తికి ఫోన్‌లో చూపిస్తాడు. అయితే తన అనుమతి లేకుండా అందులో సెక్స్ వర్కర్‌గా తన ఫొటోను చూపించారని ఆరోపిస్తూ సాక్షి మాలిక్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ చిత్రం ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. అనుమతి లేకుండా వేరే వ్యక్తుల ఫోటోలను, ముఖ్యంగా ప్రైవేట్ ఇమేజ్‌ను ఉపయోగించడం చట్ట విరుద్ధమని హైకోర్టు తీర్పునిచ్చింది. నటి అభ్యంతరం తెలిపిన సినిమాలోని సన్నివేశాలను ​వెంటనే తొలగించాలని ఆదేశించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu