జనసేన అధినేతకు తెలంగాణ నేతల విజ్ఞప్తి

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు తెలంగాణ నేతలు విజ్ఞప్తి చేశారు.. తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులను బరిలో దింపాలని కోరారు. రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది. మూడు విడుతలుగా ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో సమావేశమైన నేతలు, కార్యకర్తలు.. దీనిపై చర్చించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ తెలంగాణ ఇంచార్జ్ ఎన్ శంకర్ గౌడ్, ఉపాధ్యక్షలు బి. మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. స్థానిక సంస్థల్లో పోటీపై కార్యకర్తల అభిప్రాయాలను సేకరించాలని తెలిపారు… దానికి అనుగుణంగా సమావేశం నిర్వహించామన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఏడు స్థానాల్లో పోటీ చేశాం.. స్థానిక సంస్థల్లో కూడా పోటీచేస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారు. ఇందుకు అనుగుణంగా పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ తీసుకుని నిర్ణయానికి కట్టుబడి ముందుకు వెళ్తామని తెలిపారు.

CLICK HERE!! For the aha Latest Updates