HomeTelugu Big Stories'సలార్‌' రిలీజ్‌ ట్రైలర్‌

‘సలార్‌’ రిలీజ్‌ ట్రైలర్‌

Salaar Release Trailer Telugu

పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ‘సలార్’ సినిమా నుంచి తాజగా మరో యాక్షన్ ట్రైలర్ విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన సాంగ్స్‌, టీజర్‌, ట్రైలర్‌లు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా విడుదలైన ఈ రిలీజ్‌ ట్రైలర్‌ కూడా యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. ఈ ట్రైలర్‌ మొత్తం యాక్షన్‍ సీక్వెన్సులతో, పవర్ ఫుల్ డైలాగ్‍లతో నిండిపోయింది.

ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో హైవోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపోందిన ఈసినిమాలో శృతి హాసన్ హీరోయిన్‍గా నటించారు. జగపతి బాబు, బాబీ సింహా, టిన్నూ ఆనంద్, ఈశ్వరి రావు, శ్రీయారెడ్డి కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాకు రవిబస్రూర్ సంగీతం అందించారు. హొంబాలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

ప్రభాస్ నటిస్తున్న ఈ పాన్‌ ఇండియా సినిమా పై క్రేజ్ విపరీతంగా ఉంది. ఈ మూవీపై అంచనాలు అత్యంత భారీగా ఉన్నాయి. డిసెంబర్ 22న ‘సలార్: పార్ట్-1 సీజ్‍ఫైర్’ మూవీ రిలీజ్ కానుంది. ఇప్పటికే ఓ ట్రైలర్ రాగా.. అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు రిలీజ్‌ ట్రైలర్‌ (డిసెంబర్ 18) విడుదలైంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu