కత్రినా భర్తను పక్కకు నెట్టేసిన సల్మాన్‌ బాడీగార్డ్స్‌

ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డుల వేడుక దుబాయ్‌లో గురువారం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో బాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్‌ సెలబ్రిటీలు పాల్గొన్నారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, మరో నటుడు విక్కీ కౌశల్ (కత్రినా కైఫ్ భర్త) కూడా హాజరయ్యారు.

ఈవెంట్‌లో పాల్గొన్న వారితో విక్కీ కౌశల్‌ ఫొటోలు దిగుతుండగా.. అదే సమయంలో అటుగా సల్మాన్‌ ఖాన్‌ వచ్చారు. దీంతో ఆయన బాడీగార్డ్స్‌ విక్కీని పక్కకు నెట్టేశారు. ఈ క్రమంలో సల్మాన్‌ను చూసిన విక్కీ కౌశల్‌ అతనితో ఏదో మాట్లాడుతుండగా.. అందుకు సల్మాన్‌ ఎలాంటి సమాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు సల్మాన్‌, ఆయన బాడీగార్డ్స్‌ ప్రవర్తించిన తీరుపై మండిపడుతున్నారు.

‘సల్మాన్‌ ఖాన్‌ బాడీగార్డ్స్‌ విక్కీని పక్కకు నెట్టేశారు. ఇండస్ట్రీలో ఉన్న హీరోలతో ఎలా ప్రవర్తించాలో సల్మాన్‌ తన బాడీగార్డ్స్‌కు చెప్పాలి కదా..!’, ‘తోటి నటుడితో ఎలా ప్రవర్తించాలో సల్మాన్‌కు తెలియదా..?’, ‘సల్మాన్‌ పొగరుకు ఈ వీడియోనే నిదర్శనం’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates