నేను ఇప్పటికీ షాక్‌లో ఉన్నా.. అలాంటి తాతయ్య ఉండటం వాడి అదృష్టం: అల్లు అర్జున్‌

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కుమారుడు అయాన్‌ బుధవారం ఐదో పుట్టినరోజు జరుపుకొంటున్నాడు. ఈ సందర్భంగా బన్నీ, సతీమణి స్నేహారెడ్డి సోషల్‌మీడియా వేదికగా తమ ముద్దుల కుమారుడికి శుభాకాంక్షలు చెప్పారు. ‘హ్యాపీ బర్త్‌డే మై బేబీ. నాకు ఎంతో అమూల్యమైన వాడు. ఐదేళ్ల స్వీట్‌నెస్‌, సంతోషం, సరదాతనం, లెక్కలేనంత ప్రేమ.. మా నాన్న (అల్లు అరవింద్‌) అయాన్‌కు పుట్టినరోజు కానుకగా స్విమ్మింగ్‌ పూల్‌ ఇచ్చారు. నేను ఇప్పటికీ షాక్‌లో ఉన్నా. 45 రోజుల క్రితం ఏం కావాలని నాన్న అయాన్‌ను అడిగారు. పూల్‌ కావాలని వాడు చెప్పాడు. నాన్న సరే అని, కట్టించేశారు. అలాంటి తాతయ్య ఉండటం వాడి అదృష్టం. నాలుగో తరం పిల్లలు.. అల్లు పూల్‌’ అంటూ బన్నీ ఫొటోలు షేర్‌ చేశారు.

‘జన్మదిన శుభాకాంక్షలు అయాన్‌’ అంటూ కేక్‌ కట్‌ చేస్తున్న ఫొటోల్ని స్నేహారెడ్డి షేర్‌ చేశారు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు రౌడీ బాయ్‌’ అని చిరు అల్లుడు, నటుడు కల్యాణ్‌దేవ్‌ కూడా పోస్ట్‌ చేశారు.

CLICK HERE!! For the aha Latest Updates