HomeTelugu Trendingజర్నలిస్ట్‌పై దాడి, సల్మాన్ ఖాన్‌కు కోర్టు నోటీసులు

జర్నలిస్ట్‌పై దాడి, సల్మాన్ ఖాన్‌కు కోర్టు నోటీసులు

Salman khan gets court noti
బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం భారత్‌లోనే విదేశాల్లో సైతం ఆయనకు మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఇదిలా ఉంటే సల్మాన్‌ను తరచూ ఏదో ఒక వివాదం వెంటాడుతూ ఉంటుంది. ఇప్పటికే కృష్ణ జింకను చంపిన కేసులో సల్మాన్‌పై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే.

దీనితో పాటు ఓ జర్నలిస్ట్‌పై దాడి వివాదంలో కూడా చిక్కుకున్నాడు. 2019లో జరిగిన ఈ సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. తాజాగా ఈ కేసులో సల్మాన్‌, ఆయన బాడీగార్డ్‌ నవాజ్‌ షేక్‌కు అంధేరి కోర్టు సమన్లు జారీ చేసింది. సదరు జర్నలిస్ట్‌ అశోక్‌ పాండే.. సల్మాన్‌, ఆయన బాడీగార్డ్‌ నవాజ్‌ షేక్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. అతడి ఫిర్యాదు మేరకు లోకల్‌ పోలీసులను ఈ కేసు విచారణ చెప్పట్టాల్సిందిగా కోర్డు ఆదేశించింది. ఇటీవల దీనిపై పోలీసులు ఇచ్చిన రిపోర్ట్‌ సల్మాన్‌, ఆయన బాడీగార్డ్‌కు ప్రతికూలంగా ఉంది.

దీంతో మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ను ఆర్‌ఆర్‌ ఖాన్‌ తాజాగా జారీ చేసిన ఉత్తర్వు జారీ చేస్తూ సల్మాన్‌, ఆయన బాడీగార్డ్‌పై ఐపీసీ సెక్షన్‌ 504, 506 కింద కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అంధేరీ కోర్టు వారికి నోటిసులు జారీ చేసి తదుపరి విచారణను ఏప్రిల్‌ 5కి వాయిదా వేసింది. కాగా 2019లో ముంబై రోడ్డులో సైక్లింగ్‌ చేస్తుండగా సల్మాన్‌ తన ఫోన్‌ లాక్కున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. అదే సమయంలో మీడియా ఆయనను ఫొటోలు తీస్తున్నారని, ఈ క్రమంలో సల్మాన్‌ ఖాన్‌, ఆయన బాడీగార్డ్‌ తన దగ్గరికి వచ్చి ఫోన్‌ లాగేసుకుని బెదరించినట్లు అశోక్‌ పాండే ఆరోపించాడు.

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ పాల్గొన్న ‘ఆర్‌ఆర్ఆర్’ టీమ్‌

Recent Articles English

Gallery

Recent Articles Telugu