HomeTelugu Trendingసల్మాన్‌ ఖాన్‌తో పూరీ జగన్నాథ్‌ మూవీ

సల్మాన్‌ ఖాన్‌తో పూరీ జగన్నాథ్‌ మూవీ

salman khan movie with pur

టాలీవుడ్‌ డైరెక్టర్‌ పూరీ జ‌గ‌న్నాథ్ బాలీవుడ్‌లో అమితాబ్‌ హీరోగా ‘బుడ్డా హోగా తేరే బాప్’తో పరిచయమైయ్యాడు. అయితే తాజాగా ఆయన గురించి క్రేజీ రూమర్‌ ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అదే కండల వీరుడు స‌ల్మాన్ ఖాన్‌ డైరెక్ట్‌ చేయనున్నట్లు తెలుస్తోంది.

నిజానికి సల్మాన్‌ ఖాన్‌తో పూరీ సినిమా చేయబోతున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయ. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మించనుందని ప్రచారం జరుగుతోంది. దానికోసం ఇప్పటికే ఈ మేకర్స్‌ టీం స‌ల్మాన్ భాయ్‌కి అడ్వాన్స్‌ ఇచ్చి డేట్స్‌ కూడా తీసుకున్నట్లు చెప్పుకుంటున్నారు.

ఒకవేళ ఇదే గనక నిజమైతే తన సినిమాల్లో హీరోలను డిఫరెంట్‌గా చూపించే ఈ డాషింగ్‌ డైరెక్టర్‌ ఈ కండల వీరుడ్ని ఎలా చూపించబోతున్నాడోనని ఫ్యాన్స్‌లో ఆసక్తి పెరుగుతోంది. ప్రస్తుతం పూరీ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో చేస్తున్న పాన్‌ ఇండియా మూవీ ‘లైగర్’ చేస్తుండగా, బాలీవుడ్‌ స్టార్‌ ‘టైగర్‌ 3’ సినిమాతో బిజీగా ఉన్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu