HomeTelugu Newsబన్నీని పొగడ్తలతో ముంచెత్తిన సల్మాన్ ఖాన్

బన్నీని పొగడ్తలతో ముంచెత్తిన సల్మాన్ ఖాన్

Salman Khan praises Allu Ar
బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ న‌టిస్తున్న తాజా చిత్రం రాధే. ఈ చిత్రానికి ప్ర‌భుదేవా దర్శకుడు. ఈ సినిమాలో తెలుగు రీమిక్స్ పాట సీటీమార్ పాటను విడుద‌ల చేసింది చిత్రబృందం. తెలుగులో అల్లు అర్జున్ డ్యాన్స్‌ను మెచ్చుకుంటూ సల్మాన్ ఖాన్ ప్ర‌శంస‌లు కురిపించాడు. థాంక్యూ అల్లు అర్జున్ నువ్వు అందించిన సీటీమార్ పాట చాలా బాగుంది. నీ డ్యాన్స్ స్టైల్ అద్బుతం. ల‌వ్ యూ బ్ర‌ద‌ర్ అంటూ స్మ‌లాన్ ఖాన్ ట్వీట్ చేశాడు. అల్లు అర్జున్ స్పందిస్తూ..స‌ల్మాన్ గారు మీకు కృత‌జ్ఞ‌త‌లు. మీ నుంచి ప్ర‌శంస‌లు రావ‌డం మ‌ధుర‌మైన అనుభూతి. మీరు న‌టిస్తోన్న ‘రాధే’ మూవీ సిల్వ‌ర్ స్క్రీన్ పై చూసేందుకు అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఫ్యాన్స్ మీ సినిమాకు సీటీమార్ వేయ‌డానికి రెడీగా ఉన్నారు, ధన్యవాదాలు అంటూ బన్నీ రీట్వీట్ చేశాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu