బన్నీ హీరోయిన్ రెచ్చిపోయిందిగా!

అల్లు అర్జున్ నటించిన ‘ఇద్దరమ్మాయిలతో’ టాలీవుడ్ కు పరిచయమైంది కేథరిన్ త్రెసా. ఆ సినిమాలోనే చిట్టిపొట్టి డ్రెస్సులతో యూత్ ను అలరించింది. ఆ తరువాత సరైనోడు సినిమాలో నిండు చీరకట్టులో కనిపించి తనలో ఈ యాంగిల్ కూడా ఉందని నిరూపించింది. చిరంజీవి నటించిన ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాలో ఐటెమ్ సాంగ్ ఆఫర్ వచ్చినా, కొన్ని విబేధాల కారణంగా ఆ సినిమా నుండి తప్పుకుంది. దీంతో ఇక అమ్మడు కెరీర్ అయిపోయిందనుకున్నారంతా. కేథరిన్ కు ఆటిట్యూడ్ ఎక్కువనే ముద్ర పడిపోయింది. దీంతో తన కెరీర్ ను కాపాడుకోవాలని ఒక్కసారిగా తన గ్లామర్ డోస్ పెంచేసింది ఈ బ్యూటీ. గతవారం విడుదలైన ‘గౌతమ్ నంద’ సినిమాలో బికినీ ధరించి అలరించిన కేథరిన్ ఇప్పుడు ఐటెమ్ సాంగ్ లో కనిపించి అందరినీ ఆకట్టుకుంటోంది. 
బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తోన్న ‘జయ జానకి నాయక’ సినిమాలో కేథరిన్ ఓ ఐటెమ్ సాంగ్ చేసింది. ఇది మామూలు ఐటెమ్ సాంగ్ కాదు. కేథరిన్ ఈ సాంగ్ లో వీరలెవెల్లో రెచ్చిపోయింది. ఈ మాస్ బీట్ లో కేథరిన్ వేసుకున్న డ్రెస్సులు, ఆమె డాన్సులు ఐటెమ్ సాంగ్ కు పూర్తి న్యాయం చేశాయి. దర్శకుడు బోయపాటి.. కేథరిన్ ను రకరకాల డ్రెస్సులో చూపిస్తూ ఆమె నుండి కావల్సిన మొత్తం రాబట్టుకున్నాడు. మిగిలిన సినిమాల్లో కూడా ఆమె ఐటెమ్ సాంగ్స్ చేస్తుందా..? అంటే అనుమానమే. కాబట్టి ప్రస్తుతానికి ఈ ఐటెమ్ సాంగ్ లో ఆమె అందాల్ని అభిమానులు ఎంజాయ్ చేయొచ్చు.