దిల్ రాజు బ్యానర్ లో మరో సినిమా!

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై శర్వానంద్‌, అనుపమ పరమేశ్వరన్‌ హీరో హీరోయిన్లుగా సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన చిత్రం ‘శతమానం భవతి’. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న రిలీజై బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయ్యింది. ఈ సందర్భంగా దర్శకుడు సతీష్‌ వేగేశ్న సినిమా స‌క్సెస్ గురించి సోమ‌వారం పాత్రికేయులతో ముచ్చటించారు..
”ఏ స్క్రిప్ట్‌ అయినా నమ్మే చేస్తాం. కొన్నిసార్లు ఆడియెన్స్‌కు మనం చెప్పే కథ కనెక్ట్‌ అవుతుంది. కొన్నిసార్టు కనెక్ట్‌ కాదు. ఇక ఇలాంటి సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. కామన్‌గా ఆడియెన్స్‌ అందరూ కనెక్ట్‌ అయ్యే సబ్టెక్ట్‌ కాబట్టి సినిమా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. డెఫనెట్‌గా సినిమా సక్సెస్‌ అవుతుందని ఊహించాం కానీ ఇంత పెద్ద హ్యుజ్‌ సక్సెస్‌ అవుతుందని అనుకోలేదు. రాఘవేంద్రరావు, దాసరినారాయణరావు, కె.విశ్వనాధ్ లు ప్రత్యేకంగా అభినందించారు. తెలుగు సినిమాను ఎక్కడికో తీసుకెళ్లిన దర్శకులైన ఈ ముగ్గురు నా సినిమాను అప్రిసియేట్‌ చేయడం చాలా గొప్ప విషయం. కథ నచ్చితే దర్శకుడుకి ఇంతకుముందు సక్సెస్‌ ఉందా లేదా అని ఆలోచించకుండా సినిమా చేసే ప్రొడ్యూసర్‌ దిల్‌రాజుగారు. అందుకే ఈ సినిమా కథ ఆయనకు చెప్పాను. కథ నచ్చింది. వెంటనే చేద్దామన్నారు. ‘శతమానం భవతి’ సక్సెస్‌ దర్శకుడిగా నా బాధ్యత మరింత పెరిగింది. ప్రస్తుతానికి ఏ సినిమా చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోలేదు. దిల్‌రాజుగారితో ఓ సినిమా చేయాల్సి ఉంది. ప్రస్తుతానికి కథను సిద్ధం చేసుకున్న తర్వాత ఎవరితో చేస్తే బావుంటుందో వారికి కథ వినిపించి సినిమా చేస్తాను. నా నెక్ట్స్‌ మూవీ కూడా ఫ్యామిలీ ఎమోషన్స్‌, రిలేషన్స్‌ మీదనే ఉంటుంది” అన్నారు.