HomeTelugu Trendingసమంతకు షాకిచ్చిన అభిమాని.. మెసేజ్‌ డెలిట్‌.. వైరల్‌

సమంతకు షాకిచ్చిన అభిమాని.. మెసేజ్‌ డెలిట్‌.. వైరల్‌

8
టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్లలో సమంత ఒకరు. సమంత, పెళ్లి తరువాత కూడా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా దూసుకుపోతున్నది. లాక్ డౌన్ టైమ్‌లో ఇంట్లోనే ఉండిపోవాల్సి పరిస్థితి వచ్చింది. ఈ సమయాన్ని వినియోగించుకుంటూ.. ఆన్లైన్ ద్వారా నటనలో మెళుకువలు నేర్చుకుంటోంది. లాక్ డౌన్ పూర్తయ్యే సరికి సరికొత్త సమంతను చూస్తారని అంటోంది ఈ బ్యూటీ.

కాగా సమంత బెస్ట్ హీరోయిన్ మాత్రమే కాదు, బెస్ట్ స్టూడెంట్ కూడా… చదువుకునే రోజుల్లో సమంత తెలివైన అమ్మాయిగా స్కూల్ లో మంచి పేరుతెచ్చుకుంది. అయితే, ఈ విషయం బయట చాలామందికి తెలియదు. కానీ, సమంతకు సంబంధించిన స్కూల్ టెన్త్, డిగ్రీ సర్టిఫికెట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సర్టిఫికెట్లు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో సమంత షాక్ అయ్యింది. ఈ సర్టిఫికెట్లు నీకెలా దొరికాయని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అభిమానిని సమంత అడిగింది. దానికి అభిమాని ఎలాంటి సమాధానం చెప్పకపోగా… ఆ మెసేజ్ ను కూడా డెలిట్ చేశాడు. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu