పద్మశ్రీ అవార్డు వెనక్కి ఇచ్చేయాలనుకున్న సైఫ్ అలీఖాన్..!

అర్బాజ్‌ ఖాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షోలో బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోషల్‌మీడియాలో నెటిజన్లు తనపై చేసిన కామెంట్లను సైఫ్‌ అలీఖాన్ గుర్తు చేసుకున్నారు. తాను పద్మశ్రీ అవార్డు వెనక్కి ఇచ్చేయాలి అనుకున్నానని అన్నారు. తైమూర్‌ తండ్రి పద్మశ్రీ కొనుక్కున్నారు, రెస్టారెంట్‌లో కొంత మందిని కొట్టారు, సేక్రేడ్‌ గేమ్స్‌లో నటించే అవకాశం ఆయనకు ఎలా ఇచ్చారు? ఆయనకు నటన రాదు..అని నెటిజన్లు కామెంట్స్ చేశారని సైఫ్‌ అలీఖాన్ చెప్పారు.

దీనిపై తన అభిప్రాయం చెబుతూ చిత్ర పరిశ్రమలో నైపుణ్యం ఉన్న నటులు చాలా మంది ఉన్నారని, వారికి ఇంకా పద్మశ్రీ రాలేదని.. వారికి దక్కని పద్మశ్రీ నాకు రావడం పట్ల నాకు కాస్త ఇబ్బందిగానే ఉంది. దీన్ని స్వీకరించాలని నాకు లేదు. కానీ నటన, నైపుణ్యంలో నా కంటే తక్కువ స్థాయిలో ఉండి అవార్డు అందుకున్న వారు కూడా ఉన్నారని అన్నారు. పద్మశ్రీని వెనక్కి ఇచ్చేయాలి అనుకున్నా కానీ నేను భారత ప్రభుత్వం నిర్ణయాన్ని తిరస్కరించే స్థాయిలో లేనని మా నాన్న అనడంతో ప్రస్తుతానికి నా నటనను నేను ఆస్వాధిస్తున్నా. భవిష్యత్తులో ప్రతిభ కనబర్చడానికి ప్రయత్నిస్తా. చూద్దాం అప్పుడైనా ప్రజలు నన్ను చూసి.. ఈయన పద్మశ్రీకి అర్హుడు అంటారేమో అని అన్నారు.

CLICK HERE!! For the aha Latest Updates