HomeTelugu Newsఆ హీరో కోసం పోటీపడనున్న నయనతార, సమంత!

ఆ హీరో కోసం పోటీపడనున్న నయనతార, సమంత!

11 16
కోలీవుడ్‌లో లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార, స్టార్‌ హీరోయిన్‌ సమంత ఇద్దరికి కూడా మంచి క్రేజ్ వుంది. అలాగే టాలీవుడ్‌లోను ఇద్దరికీ మంచి ఫాలోయింగ్ వుంది. అయితే ఇప్పుడు ఈ ఇద్దరూ తారలు ఒకే తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. విజయ్ సేతుపతి హీరోగా ‘కాతు వాకుల రెండు కాదల్’ సినిమా రూపొందనుంది. ఈ సినిమాకి విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు.

పూర్తి వినోదభరితంగా సాగే ఈ సినిమాను వచ్చేనెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. వైవిధ్యభరితమైన కథాకథనాలతో ఈ సినిమా నిర్మితమవుతుంది. సమంత – నయనతార హీరోయిన్‌లుగా కనిపించనున్నారు. హీరో కోసం పోటీపడే హీరోయిన్‌లుగా, ఆయన కోసం ఫైటింగులు గట్రా చేసుకునే నాయికలుగా ఈ సినిమాలో ఈ బ్యూటీలు కనిపిస్తారట. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu