HomeTelugu Trendingరష్మిక అక్కగా.. సమంత

రష్మిక అక్కగా.. సమంత

Samantha and Rashmika in si
అక్కినేని సమంత పెళ్లయిన తరువాత కూడా వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఇప్పుడు సమంత, రష్మిక కలిసి ఓ చిత్రంలో నటించబోతున్నారన్న వార్త ప్రస్తుతం టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. పైగా వీరిద్దరూ ఆ చిత్రంలో అక్కాచెల్లెళ్లుగా నటిస్తున్నారన్నది మరింత ఆసక్తికరమైన విషయం. ఇటీవల ఓ యంగ్‌ డైరెక్టర్‌ అక్కాచెల్లెళ్ల కథతో సమంత, రష్మికలను సంప్రదించాడనీ, కథ వినగానే ఇద్దరూ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఓ ప్రముఖ బ్యానర్ ముందుకొచ్చినట్టు చెబుతున్నారు. ఇది మహిళా ప్రధాన చిత్రంగా రూపొందుతుందట. ప్రస్తుతం సమంత ‘ఫ్యామిలీ మెన్ -2’ వెబ్ సిరీస్‌తో పాటు తమిళంలో మరో రెండు సినిమాల్లో నటిస్తోంది. ఇక రష్మిక ‘పుష్ప’ సినిమాతో పాటు కన్నడ, తమిళ సినిమాలు చేస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu