HomeTelugu Big Storiesగోవా ఫిలింఫెస్టివల్‌కి గెస్ట్ గా సమంత!

గోవా ఫిలింఫెస్టివల్‌కి గెస్ట్ గా సమంత!

Samantha as a guest to goa

సౌత్ ఇండియన్ స్టార్‌ హీరోయిన్లలో సమంత నెం 1 ప్లేస్‌లో ఉంది. ఇక తాజాగా ఈ బ్యూటీ మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకోబోతుంది. గోవా 52వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కి సమంత గెస్ట్ గా వెళ్లనుంది. ఇప్పటివరకు ఏ హీరోయిన్ కి ఇలాంటి గౌరవం దక్కలేదు. గోవాలో నవంబర్ 20 నుంచి వారం రోజలు పాటు జరగనున్న ఈ వేడుకలకు సామ్ ముఖ్య అతిధిగా వెళ్లనుంది. ఆమెతో పాటు ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ టీమ్ కూడా ఆ వేడుకలలో సందడి చేయనున్నారు.

నటుడు మనోజ్ భాజ్ పాయ్, దర్శకులు అరుణ్ రాజే, వివేక్ అగ్ని హోత్రి, నటుడు జాన్ ఎడతతిల్ తదితరులు ప్రారంభోత్సవం రోజున కనిపించనున్నారు. అయితే ఈ ఆహ్వానం సమంత కి రావడానికి ఒక్క ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ లో నటించడమే అనేది కారాన్తమ్ కాదని తెలుస్తోంది. బేసిక్ గా సమంత జంతు ప్రేమికురాలు, ఎన్నో స్వచ్ఛంద సంస్థలకు సేవలు అందిస్తున్న మంచి మనసున్న మనిషి. ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా మే ఎంతోమంది పిల్లలను సాకుతోంది. వీటన్నింటి వలనే ఈ అరుదైన గౌరవం ఆమెకు దక్కింది అనే టాక్‌ కూడా ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu