HomeTelugu Big Storiesపెళ్లిరోజు సందర్భంగా భార్యతో రవి వీడియో సాంగ్‌

పెళ్లిరోజు సందర్భంగా భార్యతో రవి వీడియో సాంగ్‌

Anchor ravi video song with
తెలుగు మేల్ యాంకర్స్‌లో యాంకర్ రవికి మంచి గుర్తింపు ఉంది. పటాస్ లాంటి షోలను ఏళ్ల పాటు నడిపించిన ఘనత రవికి ఉంది. . ఆ మధ్య ఓ రోజు తన భార్య నిత్య సక్సేనా, కూతురుని ప్రపంచానికి పరిచయం చేశాడు రవి. అప్పటి వరకు రవికి పెళ్లైపోయిందని చాలా మందికి తెలియదు. ఉన్నట్లుండి తన పర్సనల్ లైఫ్‌ను బయటపెట్టేశాడు. ఇదిలా ఉంటే భార్య నిత్యను పరిచయం చేసిన తర్వాత ప్రతీ ఈవెంట్‌ను కూడా ఆమెతో జరుపుకుంటూ.. ఆ వీడియోను అభిమానులతో పంచుకుంటున్నాడు రవి. నవంబర్ 27న తమ పెళ్లి రోజు సందర్భంగా భార్య నిత్యా సక్సేనాతో ఓ వీడియో సాంగ్‌ చేశాడు.

ఇప్పటికీ గుర్తుండిపోయే.. ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకునే విధంగా ఈ వీడియోను తన భార్యకు ఈ గిఫ్ట్ ఇచ్చాడు రవి. రాహు సినిమాలోని సూపర్ హిట్ అయిన ఏమో ఏమో పాటకు కవర్ వర్షన్ చేసారు రవి దంపతులు. ప్రస్తుతం ఈ వీడియో సాంగ్ వైరల్ అవుతుంది. అందమైన లొకేషన్స్‌లో అదిరిపోయే సినిమాటోగ్రఫీతో ఈ పాట కన్నుల పండుగగా ఉంది. ఓ భార్యకు ఇంతకంటే మంచి గిఫ్ట్ ఏముంటుంది అంటూ కింద కామెంట్ చేస్తున్నారు అభిమానులు. దాంతో నెటిజన్లు వాళ్లిద్దరికీ పెళ్ళి రోజు
శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu