HomeTelugu Trendingచిరునవ్వులతో అభిమానులను అలరిస్తున్న సమంత

చిరునవ్వులతో అభిమానులను అలరిస్తున్న సమంత

Samantha in bali beach

ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన హీరోయిన్ సమంత బాలీ పర్యటనలో ఉంది. అక్కడి నుంచి తాను షేర్ చేసిన వీడియోలో కొత్తలుక్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఓ వైపు మయాసైటిస్‌ చికిత్స కోసం అమెరికా వెళ్లనున్నట్టు ప్రచారం జరుగుతోంది. కానీ బాలీ పర్యటనలో సమంత ఎంజాయ్ చేస్తోంది. బాలీ బీచ్ వద్ద ఉన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

షార్ట్ హెయిర్‌తో చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తోంది. తన స్నేహితులతో కలిసి ఆమె బాలీకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఇటీవల కోయంబత్తూరులోని సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు చెందిన ఈషా ఫౌండేషన్‌లో కొంత సమయం గడిపిన సంగతి తెలిసిందే. అక్కడ ఆమె మెడిటేషన్ చేస్తున్న ఫొటోలు వైరల్ అయ్యాయి.

సమంత విజయ్ దేవరకొండతో నటించిన ‘ఖుషి’ చిత్రం సెప్టెంబర్ 1న విడుదల కానుంది. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో కలిసి నటించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ కూడా విడుదల కాబోతోంది. మరోవైపు కొత్త ప్రాజెక్టులను ఆమె ఒప్పుకోలేదు. ముందుగా ఒప్పుకున్న ప్రాజెక్టులకు సంబంధించిన అడ్వాన్స్ ను కూడా నిర్మాతలకు వెనక్కి తిరిగి ఇచ్చేసింది.

https://www.instagram.com/reel/CvCuWJmgsuC/?utm_source=ig_web_button_share_sheet&igshid=MzRlODBiNWFlZA==

Recent Articles English

Gallery

Recent Articles Telugu