HomeTelugu Newsస్నేహ భర్తతో సమంత

స్నేహ భర్తతో సమంత

11 20

స్టార్‌ హీరోయిన్‌ సమంత టాలీవుడ్‌లో తాజాగా నటించిన చిత్రం ‘జాను’. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. కాగా తెలుగులో ఆమె తరువాతి సినిమాలకి సంబంధించిన సమాచారం ఎటువంటి సమాచారం లేదు. తమిళంలో మాత్రం ఆమె రెండు సినిమాలను అంగీకరించినట్టుగా తెలుస్తోంది. ఒక సినిమాలో ఆమె నయనతారతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనుంది. విఘ్నేశ్ శివన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

ఇక మరో సినిమాలో ఆమె హీరో ప్రసన్న జోడీగా కనిపించనుంది. ఈ సినిమాకి అశ్విన్ శరవణన్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. గతంలో తమిళంలో నయనతార ప్రధాన పాత్రధారిగా ఆయన రూపొందించిన ‘మాయ’ అక్కడ ఘన విజయాన్ని సాధించింది. అదే సినిమా తెలుగులో ‘మయూరి’గా విజయవంతమైంది. ఇప్పుడు అదే దర్శకుడి సినిమాలో సమంత చేయనుంది. ఈ సినిమాకి సంబంధించిన మిగతా విషయాలు త్వరలోనే తెలియనున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu