‘ఎఫ్‌2’ ఫస్ట్‌ లుక్‌ రేపే!

టాలీవుడ్‌ ప్రముఖ నటుడు విక్టరీ వెంకటేష్‌, మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి వస్తున్న చిత్రం ‘ఎఫ్‌2’ (ఫన్‌ అండ్‌ ఫస్ట్రేషన్‌). రీసెంట్‌గా ఈ హీరోలిద్దరు కూలీలుగా ఉన్న పిక్‌ను డైరెక్టర్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌చేయగా వైరల్‌ అయింది.

అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను సోమవారం విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్‌ ప్రకటించింది. నవంబర్‌ 5న సాయంత్రం నాలుగు గంటలకు ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో వెంకటేష్‌కి జోడిగా తమన్నా, వరుణ్‌కు జోడిగా మెహ్రీన్‌ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్‌ రాజు నిర్మిస్తున్నారు.