HomeTelugu Trendingఎన్టీఆర్‌ త్రివిక్రమ్‌ సినిమాలో సమంత?

ఎన్టీఆర్‌ త్రివిక్రమ్‌ సినిమాలో సమంత?

3 24
డైరెక్టర్‌ మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇటీవల ‘అల వైకుంఠపురంలో’ సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడమే కాకుండా అల్లు అర్జున్ కెరియర్ లో మైలురాయిగా నిలిచింది. ఇక ఈ సినిమా తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాడు. ఇటీవల ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ మూవీ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ అనంతరం త్రివిక్రమ్‌ తో సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందనను అనుకున్నారు. ఇటీవలే ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో ఆకట్టుకున్న రష్మికను ఈ సినిమాలో ఎంపిక చేసారని వార్తలు వచ్చాయి. తాజాగా రష్మిక ప్లేస్ రీప్లేస్ అయ్యిందని తెలుస్తుంది. ఆ ప్లేస్ లోకి స్టార్ హీరోయిన్ సమంత వచ్చిందని టాక్. గతంలో త్రివిక్రమ్‌ సినిమాలు ‘అత్తారింటికి దారేది’, ‘సన్ అఫ్ సత్యమూర్తి’, ‘అఆ’ ల్లో సమంత నటించిన విషయం తెలిసిందే. ఇక ఎన్టీఆర్ తో ఈ బ్యూటీ బృందావనం , రామయ్య వస్తావయ్యా, రభస, జనతాగ్యారేజ్ సినిమాల్లో జతకట్టింది. సమంత ఎంపిక పై అధికార ప్రకటన మాత్రం రాలేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu