HomeTelugu Trendingపాన్‌ ఇండియా ఫిల్మ్‌లో సమంత

పాన్‌ ఇండియా ఫిల్మ్‌లో సమంత

7 20టాలీవుడ్ లో సమంతకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ, వైవిధ్యభరితమైన పాత్రలను పోషిస్తూ విమర్శకుల ప్రశంసలను సైతం సొంతం అందుకుంటుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమల్లో కూడా నటిస్తూ తన సత్తా చాటుకుంటుంది. తాజాగా వెబ్ సిరీస్ లలో కూడా సమంత అడుగుపెట్టబోతోంది.

‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్‌కు కొనసాగింపుగా వస్తున్న ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’లో సమంత నటించబోతోంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే… ఇందులో అక్కినేనివారి కోడలు నెగెటివ్ పాత్రలో కనిపించనుందట. ఈ సిరీస్ లో తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను సమంత పూర్తి చేసిందట. ఈ వెబ్ సిరీస్ ఈ ఏడాదే అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. ఇక ప్రముఖ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్ తో ఓ సినిమాకు సమంత సంతకం చేసిందట. ఇందులో లేడీ ఓరియెంటెడ్ పాత్రను సమంత పోషించనుంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట. ఇదే కనుక నిజమైతే ఈ సినిమా సమంత కి ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు టాలీవుడ్ కోలీవుడ్ కే పరిమితమైన సామ్ ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టబోతోందట.. సమంత ఈ సినిమాను సింగల్ షెడ్యూల్ తో పూర్తి చేస్తారట. ఈ సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది .

Recent Articles English

Gallery

Recent Articles Telugu