HomeTelugu Trendingనిర్మాతగా మారిన సమంత

నిర్మాతగా మారిన సమంత

samantha launches her own hనటి సమంత.. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో బిజీగా ఉంది. ఆయా భాషల్లో స్టార్ హీరోలతో నటిస్తూ వన్ ఆఫ్‌ ది లీడింగ్‌ హీరోయిన్‌గా కొనసాగుతున్న సామ్‌ ఇప్పుడు మరో ముందడుగు వేసింది. ఇప్పటివరకు సిల్వర్‌ స్క్రీన్‌పై మెరిసిన సామ్‌ ఇక నుంచి తనలోని నిర్మాతను కూడా అందరికీ పరిచయం చేసేందుకు రెడీ అయింది.

సమంత ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ (Tralala Moving Pictures) పేరుతో హోం ప్రొడక్షన్‌ హౌస్‌ను స్థాపించింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఓ వీడియో షేర్ చేసింది. నా ప్రొడక్షన్ హౌస్‌ని ప్రకటించినందుకు సంతోషిస్తున్నా. సామాజిక అంశాలు, వాటి సంక్లిష్టత గురించి మాట్లాడే కథలను ఆహ్వానించే, వాటిని ప్రోత్సహించే ప్లాట్‌ఫాం ఇది.

చిత్రనిర్మాతలు అర్థవంతమైన, ప్రామాణికమైన, విశ్వవ్యాప్తమైన కథలను చెప్పడానికి ఒక వేదిక. కొత్త తరం ఆలోచనలు, భావోద్వేగాలను ప్రతిబింబించే కంటెంట్‌ను అందించడమే ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ ఉద్దేశం. నాకు ఇష్టమైన పాటల్లో ఒకదాని నుండి ప్రేరణ పొందిన.. బ్రౌన్ గర్ల్ ఇప్పుడు పోటీలో ఉంది. అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది సామ్‌.

సమంత ప్రస్తుతం బాలీవుడ్ యాక్టర్ వరుణ్‌ ధవన్‌తో కలిసి సిటడెల్‌ వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది. మరోవైపు అమెరికన్‌ ఫిల్మ్‌ చెన్నై స్టోరీస్‌లో కూడా నటిస్తోంది.
https://www.instagram.com/reel/C0q-kATr5oG/?utm_source=ig_web_copy_link

Recent Articles English

Gallery

Recent Articles Telugu