HomeTelugu Trendingయాంకరింగ్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టనున్న సుమ!

యాంకరింగ్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టనున్న సుమ!

suma anchoring stopped

తెలుగు స్టార్‌ యాంకర్‌ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. చాలా కాలంగా బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తుంది సుమ కనకాల. ఆమె.. తాజాగా ‘జయమ్మ పంచాయితీ’ సినిమాతో వెండితెరపై రీఎంట్రీ ఇచ్చింది. విజయ్‌ కలివారపు డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా నేడు(శుక్రవారం)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటి నుంచి సినిమాల్లోనూ నటిస్తానని స్వయంగా సుమ పేర్కొన్న సంగతి తెలిసిందే.

దీంతో యాంకరింగ్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టేస్తుందా అన్న అనుమానాలు రేకెత్తాయి. తాజాగా ఈ విషయంపై సుమ స్పందించింది. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమ మాట్లాడుతూ.. బుల్లితెరను వదిలే ఛాన్సే లేదని తేల్చి చెప్పింది. తనకు అన్నం పెట్టిన బుల్లితెర తల్లితో సమానమని, వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. సినిమాలతో పాటు బుల్లితెరపై కంటిన్యూ అవుతానని వెల్లడించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu