HomeTelugu Trendingసమంత లేటెస్ట్‌ ఫొటోషూట్‌ వైరల్‌

సమంత లేటెస్ట్‌ ఫొటోషూట్‌ వైరల్‌

Samantha new pics viral

టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంత లేటెస్ట్ ఫోటోషూట్ వైరల్‌ అవుతుంది. ట్రెండీ అవుట్ ఫిట్స్ తో ఇంట్లోనూ, బయట సమంత తన ప్రత్యేకతను చాటుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు ప్రపంచ ప్రఖ్యాత లూయి విట్టోన్ డ్రెస్సులు, ఇతర ఉపకరణాలు ధరించి తళుక్కుమంది. దీనికి సంబంధించిన ఫొటోలను సమంత తన ఇన్ స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఆపాదమస్తకం లూయి విట్టోన్ఫ్యాషన్ వేర్స్ ధరించిన సమంత పలు పోజులు ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫొటోలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రపంచ ఫ్యాషన్ రాజధాని పారిస్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే లూయి విట్టోన్.. ను ఎల్వీ అని పిలుస్తుంటారు. వరల్డ్ వైడ్ ఫ్యాషన్ షోలలో ఎల్వీ దుస్తులు, ఇతర ఉపకరణాలు తప్పనిసరిగా ప్రదర్శిస్తుంటారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu