HomeTelugu Trendingగౌతమ్‌కు శుభాకాంక్షలు తెలిపిన మహేష్‌ బాబు

గౌతమ్‌కు శుభాకాంక్షలు తెలిపిన మహేష్‌ బాబు

8 29టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు తన కుమారుడు గౌతమ్‌ నేటితో గౌతమ్‌ టీనేజ్‌లోకి వచ్చాడని సోషల్‌ మీడియా వేదికగా తెలిపాడు. సోషల్‌ మీడియాలో​ మహేష్‌ బాబుకి ఎంత ఫాలోయింగ్‌ ఉందో మనకు తెలిసిందే.. గౌతమ్‌, సితారలకు కూడా అంతే ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంటుంది. సుకుమార్‌ దర్శకత్వంలో మహేష్‌ చేసిన ‘నెం.1’ నెనొక్కడినే చిత్రంలో గౌతమ్‌ నటించిన సంగతి తెలిసిందే.

‘పదమూడో పుట్టినరోజు జరుపుకుంటున్న గౌతమ్‌కు శుభాకాంక్షలు. నువ్వు అధికారికంగా ఓ యుక్తవయస్కుడివి అయ్యావు. నీ ఈ కౌమార దశను సరదాగా, అడ్వెంచర్స్‌తో సెలబ్రేట్‌ చేసుకోవాలి’ అంటూ మహేష్‌ బాబు ట్వీట్‌ చేశాడు. మహేష్‌ ప్రస్తుతం అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమాతో మహేష్‌బాబు బిజీగా ఉన్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu