HomeTelugu Big Storiesగర్భిణీగా సమంత!

గర్భిణీగా సమంత!

Samantha playing a pregnant
టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్ సమంత ప్రస్తుతం పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘యశోద’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హరి మరియు హరీష్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో సమంత ప్రెగ్నెంట్ గా కనిపించబోతుందంట. ఇప్పటికే ఈ సినిమాలో సమంత నర్స్ గా కనిపిస్తుందని వార్తలు గుప్పుమంటున్న వేళ ఆమె గర్భిణీగా కనిపిస్తుంది అనేవార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నర్స్ అయినా ఒక గర్భిణీ మహిళకు కొన్ని అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు .. ఆమె ఒంటరిగా ఎలా వాటన్నింటినీ ఎదుర్కొంది అనే కోణంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.

Samantha 1

ఇక దీంతో సమంత కల ఈ విధంగానైనా నెరవేరబోతోంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. చైతన్యతో సామ్ విడిపోవడానికి కారణం పిల్లలు అని, సామ్ పిల్లలు కావాలనుటుండగా.. చై వద్దని అన్నాడని, అందుకే అభిప్రాయ బేధాల వలన వారు విడిపోయినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఏదిఏమైనా ఈ సినిమాతో సామ్ గర్భవతి కోరికను తీర్చుకొంటుంది అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందొ తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం హైదరాబాద్ లో లాంచింగ్ షెడ్యూల్ తో షూటింగ్ ప్రారంభం కాగా.. తదుపరి షెడ్యూల్ త్వరలో ప్రారంభమవుతుంది.

Samantha 2

యశోద చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రను పోషిస్తున్నారు. తన పాత్ర సమంత పాత్రతో సమానంగా ఉంటుందట. ఈ చిత్రం 2022 వేసవిలో తెలుగు- తమిళం- మలయాళం- కన్నడ- హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu