HomeTelugu Big Storiesమహేష్‌.. వీకెండ్‌ వ్యవసాయం కాన్సెప్ట్‌ స్ఫూర్తి.. అభిమానులు, స్కూల్‌ పిల్లలు

మహేష్‌.. వీకెండ్‌ వ్యవసాయం కాన్సెప్ట్‌ స్ఫూర్తి.. అభిమానులు, స్కూల్‌ పిల్లలు

7 9సినిమాలు బ్లాక్‌బస్టర్‌ అయినప్పటికీ వాటిలోని సందేశాన్ని అర్థంచేసుకుని ప్రేక్షకులు దాని నుంచి స్ఫూర్తిపొందితే అప్పుడు కలిగే ఫీలింగే వేరని అభిప్రాయపడుతున్నారు సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు. ఆయన హీరోగా నటించిన ‘మహర్షి’ మూవీ ఇటీవల విడుదలై మంచి విజయం అందుకుంది. సినిమాలో రైతుల విలువను తెలియజేస్తూ ప్రేక్షకుడిలో మంచి ఆలోచన రేకెత్తేలా తెరకెక్కించారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అయితే ఈ సినిమా నుంచి స్ఫూర్తిపొంది ప్రముఖ నిర్మాత మధుర శ్రీధర్‌ రెడ్డి పొలంలోకి అడుగుపెట్టారు.

‘రైతులకు సానుభూతి అవసరం లేదు. వారికి మన గౌరవం దక్కాలి. ‘మహర్షి’ సినిమా ఓ మంచి ఆలోచనను కలిగించింది. రైతుల కష్టాలను తెరపై నిజాయతీగా చూపించినందుకు మహేష్‌ ‌, వంశీ, దిల్‌రాజును అభినందించాలి. నాకు వీకెండ్‌ వ్యవసాయం అన్న కాన్సెప్ట్‌ చాలా నచ్చింది. ఎందుకంటే నేను చేస్తాను కాబట్టి’ అని ట్వీట్‌ చేస్తూ పొలం దున్నుతున్న ఫొటోను పంచుకున్నారు.

7a 2

దీనిని చూసి అమిత్‌ సజానే అనే నెటిజన్‌ కూడా స్ఫూర్తి పొందారు. పొలం పనులు చేస్తున్న ఫొటోను మహేష్‌ కు, ‘మహర్షి’ చిత్రబృందానికి ట్యాగ్‌ చేస్తూ.. ‘పుడిమికి మనిషికి మధ్య ఉన్న గొప్ప అనుబంధమే వ్యవసాయం. ‘మహర్షి’ సినిమా నుంచి స్ఫూర్తిపొందాను’ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్స్‌ చూసిన మహేష్‌ వారిని అభినందించారు.

బ్లాక్‌బస్టర్‌ సినిమాలు ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటాయి. కానీ వాటిలోని సందేశాన్ని ప్రేక్షకులు అర్థంచేసుకుని పాటించినప్పుడు కలిగే అనుభూతి వర్ణనాతీతం. వీకెండ్‌ వ్యవసాయానికి మంచి స్పందన వస్తోంది. బంగారు భవిష్యత్తుకు ఇది గొప్ప ప్రారంభం. మన తరానికే కాదు భావితరాలకు కూడా. ఇంతటి గొప్ప బాధ్యతను తమ భుజాలపై వేసుకున్నందుకు మధుర శ్రీధర్‌, అమిత్‌ సజానేలను అభినందించాలి’ అని పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu