అనసూయ ‘రంగస్థలం’ డైలాగ్ లీక్ చేసింది!

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రంగస్థలం’. సమంత హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో యాంకర్ అనసూయ కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఆమె ఐటెమ్ సాంగ్ లో కనిపిస్తుందని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఆ సంగతి పక్కన పెడితే తాజాగా అనసూయ ‘రంగస్థలం’ సినిమాకు సంబంధించిన ఓ డైలాగ్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘నింద నిజమైతే తప్పక దిద్దుకో.. అబద్ధమైతే నవ్వేసి ఊరుకో..’ అంటూ సాగిన డైలాగ్ ఇది. ఈ డైలాగ్ తో పాటు ఆమె ఓ ఫోటోను కూడా షేర్ చేసింది. ఆ ఫోటోలో.. ఓ కుండ ఆ పక్కనే కాలికి గజ్జెలు కట్టుకున్న ఓ మహిళ పాదాలు కనిపిస్తున్నాయి.  ఆ పాదాలు కూడా అనసూయవే అయి ఉంటాయి. ఇంతకీ ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉంటుందనే విషయం మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. 
అయితే ఆమె షేర్ చేసిన ఈ డైలాగ్ పై సోషల్ మీడియాలో ఆమెకె వినిపిస్తున్నారు కొందరు నెటిజన్లు. మొన్నామధ్య ‘అర్జున్ రెడ్డి’ హీరో విజయ్ దేవరకొండపై అనసూయ విరుచుకు పడ్డ సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ డైలాగ్ బయటకు రాగానే కొందరు నెటిజన్లు ‘అందుకే విజయ్ దేవరకొండ నవ్వేసి ఊరుకున్నాడు’ అంటూ అనసూయపై రివర్స్ కౌంటర్లు వేస్తున్నారు.