HomeTelugu Trendingకేటీఆర్‌పై సమంత పోస్ట్‌.. వైరల్‌

కేటీఆర్‌పై సమంత పోస్ట్‌.. వైరల్‌

Samantha post on ktr

టాలీవుడ్‌ స్టార్‌ సమంత అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత కెరీర్‌ పరంగా దూసుకుపోతుంది. సోషల్‌ మీడియాలో కూడా ఈ అమ్మడు మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. పర్సనల్‌ విషయాలతో పాటు వివిధ అంశాలపై స్వేచ్ఛగా పోస్టులు పెడుతోంది. తాజాగా సమంత తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై చేసిన ఓ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆప‌ద‌లో ఉన్న పిల్ల‌ల‌ను ఆదుకునేందుకు మంత్రి సత్యవతి రాథోడ్‌ ఇటీవల బాల ర‌క్ష‌క్ వాహ‌నాల‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. జిల్లాకొక‌టి చొప్పున 33 బాల ర‌క్ష‌క్ వాహ‌నాల‌ను నిన్న ప్రారంభించారు. 1098కి డయల్ చేస్తే వెంటనే ఆదుకునేలా ఏర్పాట్లు చేశారు.

సత్యవతి నిర్ణయాన్ని ప్రశంసిస్తూ.. మంత్రి కేటీఆర్‌ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టాడు. మంత్రి సత్యవతి గొప్ప నిర్ణయం తీసుకుందని కొనియాడారు. మంత్రి కేటీఆర్‌ చేసిన ఈ పోస్ట్‌ను సమంత తన ఇన్‌స్టా స్టోరీలో పెట్టి, దండం పెడుతూ చప‍్పట్లు కొడుతున్న ఎమోజీలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu