మణిరత్నం సినిమా నుంచి తప్పుకున్న కీర్తి సురేష్‌.!


ప్రముఖ దర్శకుడు మణిరత్నం.. కల్కి రచించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ అనే పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని ఓ చిత్రం తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ థాయ్‌లాండ్‌లో ప్రారంభమయ్యింది. ఇందులో ఐశ్వర్య రాయ్‌, కీర్తి సురేశ్‌, మోహన్‌బాబు, కార్తీ, జయంరవి, అమితాబ్‌ బచ్చన్‌ కీలకపాత్రలు పోషించనున్నట్లు సమాచారం. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల కీర్తి ఈ సినిమా నుంచి తప్పుకున్నారని కోలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి.

ఇందుకు కారణమేమిటంటే.. కీర్తి సురేశ్‌ ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చిత్రంతోపాటు తలైవా 168వ సినిమాలో నటించాల్సి ఉంది. అయితే ఈ రెండు సినిమాలకు డేట్స్‌ కుదరకపోవడంతో ఆమె మణిరత్నం సినిమా నుంచి తప్పుకొన్నట్లు తెలుస్తోంది. ఎప్పటి నుంచో రజనీకాంత్‌ సరసన నటించాలని ఉన్నందుకే ఆమె ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ నుంచి  తప్పుకొన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

తలైవా 168 చిత్రంతోపాటు కీర్తి సురేశ్‌ ‘పెంగిన్వ్‌’ చిత్రంలో నటించారు. హీరోయిన్‌ ప్రాధాన్యమున్న ఈ సినిమాకు కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. వీటితో పాటు ఆమె అజయ్‌ దేవగణ్‌ చిత్రం ‘మైదాన్‌’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates