HomeTelugu Big Storiesసమంతకు మరో ఐటెమ్‌ సాంగ్‌ ఆఫర్‌

సమంతకు మరో ఐటెమ్‌ సాంగ్‌ ఆఫర్‌

Samantha another item song
పుష్ప సినిమాలో సమంత చేసిన ఐటమ్ సాంగ్ “ఊ అంటావా మావా” దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెకు మరో ఐటెమ్‌ సాంగ్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి సినీ జనాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. నిజానికి పుష్ప సినిమాలో మొదట ఐటమ్ సాంగ్ చేయడానికి సమంత ఆసక్తి చూపించలేదట. అల్లు అర్జున్, సుకుమార్ ఒప్పించి మరీ ఐటమ్ సాంగ్ చేయించారు. అయిష్టంగానే ఈ ఐటమ్‌ సాంగ్ సమంతకు ఎనలేని క్రేజ్ తెచ్చిపెట్టింది.

Samantha item song2

ప్రస్తుతం వరుస సినిమాలతో సమంత బిజీగా ఉంది. నాగ చైతన్యతో విడాకుల అనంతరం పూర్తిగా సినిమాలపైనే దృష్టిపెట్టింది. వచ్చిన అవకాశం ఏదీ వదులుకోకుండా ముందుకెళ్తోంది సమంత. పుష్పలో సమంత ఐటమ్ సాంగ్‌కు సల్మాన్ కూడా మెచ్చుకున్నాడు. దానికి ప్రేమతో సామ్ రిప్లై ఇచ్చింది. ఈ క్రేజ్ దృష్ట్యా ఇప్పుడు ఆమెను మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులో ఐటం సాంగ్ చేయమని అడుగుతున్నారట. అర్జున్ రెడ్డి సినిమా తో క్రేజీ డైరెక్టర్‌గా మారిన సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం బాలీవుడ్‌లో రణబీర్ కపూర్‌తో యానిమల్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఒక మాస్ మసాలా ఐటమ్ సాంగ్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. బాలీవుడ్ సహా టాలీవుడ్ లో కూడా కొంతమంది హీరోయిన్‌లను సంప్రదించారట. సమంత అయితే కరెక్ట్‌గా ఉంటుందని అనుకుంటున్నారట.

Samantha item 3

పుష్పలోని ఐటమ్‌ సాంగ్‌ను మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. సమంత ఈ ఐటమ్ సాంగ్ చేయడానికి ఒప్పుకుంటుందా అనే దానిపై ప్రస్తుతానికి సందిగ్ధం. అయితే సమంతనే కాకుండా హీరోయిన్లు అంతా ఇప్పుడు ఐటమ్ సాంగ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని అంటున్నారు. ఐటమ్‌ సాంగ్‌తో భారీ రెమ్యూనరేషన్‌తో పాటు క్రేజ్ కూడా బాగా వస్తుండటంతో హీరోయిన్లు సైతం ఐటెమ్ సాంగ్స్‌పై ఆసక్తి చూపుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu