వెబ్‌ సీరిస్‌ ప్లాన్ చేస్తున్న జక్కన్న!

దర్శకధీరుడు రాజమౌళి తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. లాక్‌డౌన్ అనంతరం షూటింగ్‌ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ ప్రస్తుత పరిస్థితులు చక్కబడే వరకూ షూటింగ్ ప్రారంభించే అవకాశాలు లేవు. ఇప్పటికే సీరియళ్లు షూటింగ్ ప్రారంభించినా సెట్‌లోని పలువురికి కరోనా సోకుతుండటంతో అవికూడా నిలిచిపోయాయి.

అందుకే రౌజమౌళి ఈ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలా అనే ఆలోచిస్తున్నారట. అందుకోసమే త్వరలో మహేష్ బాబుతో తీయబోయే సినిమా స్క్రిప్ట్ వర్క్‌పై ఫోకస్ పెట్టబోతున్నారట. అంతే కాకుండా ఈ సమయంలోనే టాలెంట్‌ ఉండి అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారిని ఆహ్వానించి వారితో వెబ్ సిరీస్ లు నిర్మించేందుకు సిద్దం అవుతున్నారట. కొన్ని వెబ్ మూవీస్ లను కూడా తీయబోతున్నారట. రాబోయే కాలమంతా ఓటీటీదే కావడంతో పెద్ద డైరెక్టర్లు సైతం వెబ్‌ సిరీస్‌లు రూపొందించే పనిలో పడ్డారు.

CLICK HERE!! For the aha Latest Updates