HomeTelugu Trendingరకుల్‌, సారాలకు క్షమాపణలు చెప్పిన సమంత!

రకుల్‌, సారాలకు క్షమాపణలు చెప్పిన సమంత!

Samantha says sorry to raku
అక్కినేని సమంత.. రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్ కు సోషల్ మీడియా వేదికగా సారీ చెప్పింది. బాలీవుడ్ హీరో సుశాంత్ మృతి కేసులో డ్రగ్స్ కోణం సంచలనాలకు తెరలేపుతుంది. ఇప్పటికే సుశాంత్ లవర్‌ రియా చక్రవర్తిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రియాను ఎన్సీబీ అధికారులు విచారిస్తున్నారు. ఈ విచారణలో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీల పేర్లు బయటకు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో రకుల్ ప్రీత్ సింగ్ పేరు అలాగే సారా అలీఖాన్ పేరుకూడా రియా బయటపెటినట్టు వార్తలు వచ్చాయి. దాంతో నెటిజన్లు వారిని ట్రోల్స్ చేయడం ప్రారంభించారు.

తాజాగా ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా మాట్లాడుతూ.. మేము ఇంకా డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటుల జాబితాను రెడీ చేయలేదని కేవలం డ్రగ్స్ సరఫరా చేసేవారిని గుర్తించం అని తెలిపారు. అయితే రియా, రకుల్, సారాల పేర్లు చెప్పింది నిజమేనా అని ప్రశ్నించగా… లేదు అసలు మేము ఇంకా ఎవరి జాబితాను రెడీ చేయలేదు అని మల్హోత్రా అన్నారు. దాంతో సోషల్ మీడియాలో రకుల్, సారాలను కామెంట్స్ చేస్తూ ట్రోల్స్ చేసిన వారు ఇప్పుడు వారికి సారీ చెప్తూ పోస్ట్ చేస్తున్నారు. అదే విధంగా సమంత కూడా రకుల్, సారాలకు క్షమాపణలు చెప్తూ పోస్ట్ చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu