HomeTelugu Trendingసీక్రెట్ పెళ్లి పొటోలు షేర్ చేసిన రాఖీ సావంత్

సీక్రెట్ పెళ్లి పొటోలు షేర్ చేసిన రాఖీ సావంత్

5b 1
బాలీవుడ్‌లో వివాదాల నటి రాఖీ సావంత్ గతేడాది సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో హల్‌చల్‌ చేసే అందాల భామ రాఖీ సావంత్. అసలు వివాదాలకు కేరాఫ్ రాఖీ సావంత్. ఈ భామ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. తన గ్లామర్ ఫొటోలను షేర్‌ చేస్తుంటుంది. ఇప్పుడు తాజాగా తన పెళ్లి ఫొటోలను షేర్ చేసింది. తన భర్త ముఖం చూపించకుండా తాను మాత్రమే కనిపించేలా ఉన్న ఫొటోలు షేర్‌ చేసింది. పెళ్లి దుస్తుల్లో తన భర్త కనిపించకుండా ఫొటోలను కట్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. దీనికి మిస్టరీ హస్బండ్ అనే క్యాప్షన్ ఇచ్చింది. దీంతో నెటిజన్లు ఈ ఫొటోలపై వరుస కామెంట్లు పెడుతున్నారు. కొందరైతే వ్యంగ్యంగా కామెంట్ చేస్తున్నారు. పూర్తి ఫొటోను చూపించండి మేడమ్ అంటూ ఒకరు.. మీరు భర్త లేకుండానే చేసుకున్నారా అంటూ మరొకరు.. తమ స్టైల్లో కామెంట్లు విసురుతున్నారు. ఈ ఫొటోల్లో హిందూ సంప్రదాయంతో పాటు, క్రైస్తవ సంప్రదాయ దుస్తులు ధరించడం విశేషం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu