చైతన్య భుజాలపై సేదతీరుతున్న సమంత‌.. అభిమానుల ఫన్నీ ట్వీట్స్‌

స్టార్‌ హీరోయిన్‌ సమంత తన భర్త నాగచైతన్యతో కలిసి ఉన్న చక్కటి ఫొటోను షేర్‌ చేశారు. ఇద్దరూ విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఈ ఫొటో తీసినట్లు తెలుస్తోంది. చైతన్య భుజాలపై సేదతీరుతూ సామ్‌ కనిపించారు. ఆయన భార్య చేయి పట్టుకుని, ముందు ల్యాప్‌టాప్‌ పెట్టుకుని ఏదో చూస్తున్నారు. ‘చివరికి.. మిగిలినవేవీ ఇంకే అవసరం లేదు.. జీవితంలో ప్రేమ ఒక్కటి చాలు .. అనే అర్థంతో ఈ ఫొటోకు సామ్‌ క్యాప్షన్‌ ఇచ్చారు.

ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. ముచ్చటైన దంపతులు అని కామెంట్లు చేశారు. మరికొందరు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో సామ్‌ డైలాగ్‌ను ఫొటోకు జత చేశారు. ‘నాకు ఇష్టమైనవి రెండే రెండు.. ఒకటి నిద్ర, ఇంకోటి మంచి మొగుడు’ అనే డైలాగ్‌ను ఫొటోపై రాశారు. దీన్ని సమంత తిరిగి రీట్వీట్‌ చేశారు. నవ్వుతున్న ఎమోజీలను షేర్‌ చేశారు. సమంత, చైతన్య నటించిన ‘మజిలీ’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి, మంచి టాక్‌ అందుకుంది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కూడా చక్కటి వసూళ్లు రాబడుతోంది.