సమంతకు ఇష్టమైన ఫొటో చూశారా

టాలీవుడ్‌ ప్రముఖ నటుడు విక్టరీ వెంకటేశ్‌ కుమార్తె ఆశ్రిత పెళ్లి వేడుక గత నెల జైపూర్‌లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ రేస్‌ క్లబ్‌ ఛైర్మన్‌ సురేందర్‌ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో ఆమె వివాహం జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులతోపాటు సినీ ప్రముఖులు కూడా హాజరై సందడి చేశారు. కాగా పెళ్లిలో తీసిన ఓ ఫొటోను సమంత మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘ఫుల్‌ ఫీల్స్‌’ అంటూ వెంకటేశ్‌, ఆశ్రితలను ట్యాగ్‌ చేశారు. అందరూ ఎంతో ఆనందంగా ఫొటోకు పోజిచ్చారు. దగ్గుబాటి వారితో సమంత ఉన్న ఈ ఫొటో సోషల్‌మీడియాలో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. అదేవిధంగా సామ్‌ మరో ఫొటోను షేర్‌ చేస్తూ.. ఇది తనకు ఎంతో ఇష్టమైందని పేర్కొన్నారు. ఇంత చక్కటి ఫొటోను తనకిచ్చిన ఫొటోగ్రాఫర్‌ రాజ్‌కు ధన్యవాదాలు చెప్పారు. ఫిబ్రవరిలో ఆశ్రిత, వినాయక్‌ల నిశ్చితార్థం జరిగింది. చాలా ఏళ్లు ప్రేమించుకున్న వీరు పెద్దల అంగీకారంతో భార్యాభర్తలయ్యారు.