HomeTelugu Trendingమామ బాటలోనే కోడలు!

మామ బాటలోనే కోడలు!

10 20
నాగచైతన్యతో పెళ్లి తరువాత.. సమంత సినిమాల జోరు పెంచింది. మహిళా ప్రాధాన్యమున్న సినిమాలు ఎక్కువగా చేస్తున్న సమంత వరుస విజయాలతో దూసుకెళుతోంది. కేవలం సినిమాలతోనే కాదు.. ఆమె అభిమానులను అలరించేందుకు వెబ్‌ సిరీస్‌లోకీ అడుగుపెట్టింది. అంతటితో ఆగకుండా మరో అడుగు ముందుకేసి ఓ రియాలిటీ షోకు హోస్ట్‌గా కూడా చేయనున్నట్లు సమాచారం.

ఇటీవల సమంత హీరోయిన్‌గా వచ్చిన చిత్రం ‘జానూ’ కలెక్షన్ల పరంగా అంతపెద్ద విజయం సాధించకపోయినా ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ సినిమా వెంటనే తన తర్వాతి సినిమాలకు ఓకే చెప్పేసింది సమంత. విఘ్నేష్‌ దర్శకత్వంలో ‘కథువక్కుల రెండు కాదల్‌’ అనే చిత్రంలో విజయ్‌ సేతుపతి, నయనతారతో కలిసి సమంత కనిపించనుంది. అంతేకాదు.. అశ్విన్‌ శరవరణ్‌ దర్శకత్వంలో వస్తున్న ఓ లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలోనూ ఆమె నటిస్తున్నట్లు సమాచారం. సినిమాల విషయం పక్కనపెడితే.. ‘ది ఫ్యామిలీ మ్యాన్‌2’ తో ఆమె తొలిసారిగా వెబ్‌సిరీస్‌లోకి అడుగుపెట్టనుంది. ఆ వెబ్‌ సిరీస్‌ ముగిసిన వెంటనే ఓ రియాలిటీ షోలో కనిపించనుంది. అయితే, రియాలిటీ షోకు హోస్ట్‌గా చేస్తుండటంపై సమంత ఎలాంటి ప్రకటన చేయలేదు. సామ్‌ చేయనున్న ఈ షో మీలో ఎవరు కోటీశ్వరుడును పోలి ఉంటుందని తెలుస్తోంది. తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు రియాలిటీ షోకు నాగార్జున హోస్ట్‌గా పని చేసిన విషయం తెలిసిందే. తాజాగా సమంత సైతం అదే బాటలో పయనిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu