HomeTelugu Trendingఫన్నీగా 'షాదీ ముబారక్‌' టీజర్‌

ఫన్నీగా ‘షాదీ ముబారక్‌’ టీజర్‌

Shaadi mubarak teaserతెలుగు బుల్లి తెరపై మొగ‌లిరేకులు సీరియ‌ల్ తో చాలా మంది ఫాలోవ‌ర్ల‌ను సంపాదించుకున్నాడు న‌టుడు సాగ‌ర్ (ఆర్కే నాయుడు). సిద్దార్థ‌, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ చిత్రాల త‌ర్వాత సాగ‌ర్ న‌టించిన మూడో చిత్రం ‘షాదీ ముబార‌క్‌’. ఈ మూవీ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ టీజర్‌ ఇప్ప‌టివ‌ర‌కు నీ ఇంటి పేరుతో బ‌తికా..నెక్ట్స్ ఆ వ‌చ్చేవాడి ఇంటి పేరుతో బ‌త‌కాలి క‌దా.. అని హీరోయిన్ త‌న త‌ల్లితో అంటుంది. హీరో ఇంటిపేరు సున్నిపెంట‌ చుట్టూ తిరుగుతూ ఫ‌న్ గా, కొత్త‌గా సాగుతూ అంద‌రినీ అల‌రిస్తుంది. సాగ‌ర్ ఈ సారి ఎలాగైనా మంచి హిట్టు కొట్ట‌డం ఖాయంగా అనిపిస్తుంది. ఈ చిత్రానికి ప‌ద్మ‌శ్రీ డైరెక్ట‌ర్ కాగా..సునీల్ కాశ్య‌ప్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు-శిరీష్ నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu