HomeTelugu Trendingరామ్‌ చరణ్‌ విడుదల చేయనున్న 'పులి - మేక' ఫస్ట్‌గ్లింప్స్‌

రామ్‌ చరణ్‌ విడుదల చేయనున్న ‘పులి – మేక’ ఫస్ట్‌గ్లింప్స్‌

puli meka web series first
‘జీ 5’ తాజాగా ‘పులి – మేక’ అనే థ్రిలర్‌ జోనర్‌ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన ఫస్ట్‌ గ్లింప్స్ ను రేపు మధ్యాహ్నం 12 గంటలకు మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్ విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను విడుదల చేశారు.

చక్రవర్తి రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ కి కోన వెంకట్ కథను అందించడమే కాకుండా, తన సొంత బ్యానర్లో నిర్మించారు. పోలీస్ డిపార్టుమెంటు ని టార్గెట్ గా చేసుకుని వరుస హత్యలు చేసే ఒక సీరియల్ కిల్లర్ కథ ఇది. తెలుగు .. తమిళ భాషల్లో నిర్మితమైంది.

puli meka 1

ఈ వెబ్‌ సిర్‌స్‌తో ఆది సాయికుమార్‌ డిజిటల్‌ ఎంట్రీ ఇస్తున్నాడు.  ప్రస్తుతం ఆది సాయికుమార్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే ఒకటి, రెండు తప్ప ఆయనకు హిట్‌ని ఇచ్చిన సినిమాలు తక్కువే అని చెప్పాలి. ఓటీటీ ఫ్లాట్‌ ఫార్మమ్‌ లో అయిన ఆది విజయం సాధిస్తాడేమో చూడాలి.

ఆది సాయికుమార్‌- లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో సిరి, ముక్కు అవినాశ్, రాజా చేంబోలు ఇతర ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

చెక్కిన పాలరాతి శిల్పం లాంటి గ్లామర్ తో.. రుక్సార్‌ ధిల్లన్‌

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu